Current Affairs Telugu Daily

షీలాభిడే కమిటీ గడువు 6 నెలలు పొడిగింపు
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూులులో ప్రభుత్వ రంగ సంస్థల విభజనకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి షీలాభిడే అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ గడువును 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ 2017 సెప్టెంబర్‌ 7న ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి నిర్దేశించిన గడువు ఆగస్టు నెలాఖరుకు ముగిసింది. చట్ట పరిధిలో 91 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా 70 సంస్థలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల, అప్పుల విభజన జరిగింది. 42 సంస్థల్లో ఉద్యోగుల విభజన పూర్తయింది. మిగిలిన సంస్థల్లో ఆస్తుల, అప్పుల, ఉద్యోగుల విభజన కోసం షీలాభిడే కమిటీ గడువును మరో 6 నెలలు (2018 ఫిబ్రవరి వరకు) పొడిగించాని కేంద్రం నిర్ణయించింది.
views: 1288



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams