Current Affairs Telugu Daily

పొలిటికో-50 జాబితాలో ఐదుగురు భారతీయ అమెరికన్లు
అమెరికా రాజకీయాల్లో విశేష సేవలందించిన 50 మంది ప్రముఖుల పేర్లతో ప్రతి సంవత్సరం పొలిటికో మ్యాగజైన్‌ ప్రకటించే జాబితాలో ఈసారి ఐదుగురు భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ, ట్రంప్‌ కార్యవర్గంలో కీలక పదవిలో ఉన్న సీమావర్మ, న్యాయవాది నీల్‌ కత్యాల్‌, ఆర్థికవేత్త అపర్ణ మాథుర్‌, న్యాయవాది నియోమి రావులకు ఈ ఘనత దక్కింది. ఈ జాబితాలో హేలీ 22వ, సీమా 26వ, మాథుర్‌ 32వ, కత్యాల్‌ 40వ, నియోమి 42వ స్థానాల్లో నిలిచారు. వైట్‌హౌస్‌ మాజీ ప్రధాన వ్యూహకర్త స్టీవ్‌ బానన్‌కు ఈ జాబితాలో అగ్రస్థానం దక్కింది.
views: 970

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams