Current Affairs Telugu Daily

ప్రపంచ వర్సిటీ ర్యాంకుల్లో భారత్‌ వెనుకంజ
ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో భారత్‌ కిందకి జారింది. ప్రపంచవ్యాప్తంగా 77 దేశాల్లోని 1000 వర్సిటీలతో రూపొందించిన జాబితాలో భారత్‌ వాటా 31 నుంచి 30కి తగ్గింది. టైమ్స్‌ ఉన్నత విద్య(టీహెచ్‌ఈ) విడుదల చేసిన వార్షిక ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో గత ఏడాది 201-250 బ్యాండులో ఉన్న భారత విజ్ఞానశాస్త్రాల సంస్థ(ఐఐఎస్‌సీ) ఈ ఏడాది 250-300 బ్యాండులోకి దిగింది. పరిశోధన ప్రభావం స్కోర్‌, పరిశోధక ఆదాయం తగ్గిన ఫలితంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ, కాన్పుర్‌, మద్రాస్‌ ఐఐటీలు సైతం ఒక బ్యాండు దాకా తగ్గాయి. భారీ, సుస్థిర నిధులతో ఆసియాలోని చైనా, హాంకాంగ్‌, సింగపూర్‌ల్లోని వర్సిటీలు పైపైకి ఎదుగుతున్నాయి. ఐఐఎస్‌సీ 251-300 బ్యాండులో ఉండగా, బాంబే ఐఐటీ 351-400, ఢిల్లీ, కాన్పుర్‌, ఖరగ్‌పూర్‌, రూర్కీ ఐఐటీలు 501-600 బ్యాండులో నిలిచాయి. 
ప్రపంచస్థాయిలో టాప్‌`5 వర్సిటీలు
1. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ 
2. కేంబ్రిడ్జి వర్సిటీ
3. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ
4. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ
5. ఎంఐటీ

views: 853

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams