Current Affairs Telugu Daily

తెలంగాణ పౌరసరఫరాల శాఖకు 2 స్కోచ్‌ అవార్డులు
పౌర సరఫరాల శాఖలో వినియోగిస్తున్న శాస్త్ర, సాంకేతికతకు గుర్తింపు లభించింది. పౌర సేవలను సరళతరం చేయడంతోపాటు పారదర్శకత తీసుకురావడంతో స్కోచ్‌ సంస్థ ఆ శాఖకు 2 అవార్డులను ప్రకటించింది. అక్రమాలను అడ్డుకునేందుకు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా నిత్యావసర సరకుల కదలికను పర్యవేక్షిస్తారు. నిత్యావసరాలను సరఫరా చేసే 1,337 వాహనాలు, 46 కిరోసిన్‌ ట్యాంకర్లకు జీపీఎస్‌ అమర్చారు. గిడ్డంగుల్లో కెమెరాను ఏర్పాటు చేశారు. వాహనాల కదలికలు, గిడ్డంగుల్లో జరుగుతున్న వ్యవహారాలను పౌరసరఫరాల భవన్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా పర్యవేక్షిస్తారు. ఆర్థిక వ్యవహారాలను గాడిలో పెట్టేందుకు ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఎఫ్‌ఎంఎస్‌)ను అమల్లోకి తీసుకొచ్చారు. ధాన్యం కొనుగోలు వ్యవహారాలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించడంలో ఈ విధానం కీలక భూమిక నిర్వహించింది. ఈ విధానానికి కూడా స్కోచ్‌ సంస్థ అవార్డును అందజేసింది. 
తెలంగాణ ఇంటర్‌ బోర్డుకు 2 స్కోచ్‌ అవార్డులు
ఇంటర్‌ పరీక్ష నిర్వహణలో సాంకేతిక, నూతన సంస్కరణలు.. విద్యార్థుల, కళాశాలలకు ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్‌ మండలికి స్కోచ్‌ సంస్థ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ కింద 2 అవార్డులు ప్రకటించింది.

views: 1063

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams