Current Affairs Telugu Daily

నదుల అనుసంధానంపై కమిటీ నివేదిక
నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ న్యాయపరమైన అంశాలపై అధ్యయనం చేసి
నివేదికను ఇచ్చేందుకు ప్రత్యేకంగా మరో కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌
ఎ.డి.మొహిలే ఛైర్మన్‌గా పలువురు నిపుణులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదికను
సమర్పించింది.
- నీటిని, నిర్వహణను ఉమ్మడి జాబితా లేదా కేంద్ర జాబితాలోకి తెచ్చేలా రాజ్యాంగ సవరణకు ఈ కమిటీ
సానుకూలత వ్యక్తం చేయలేదు. సర్కారియా కమిషన్‌, పూంచీ కమిషన్‌ కూడా దీనిని వ్యతిరేకించిన
విషయాన్ని కమిటీ ప్రస్తావించింది.
- బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా నీటిని మళ్లించేలా కేంద్ర ప్రభుత్వం
మరో చట్టాన్ని చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. 
- ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 2012 జాతీయ జల విధానాన్ని అంతర రాష్ట్ర నదులకు అమలు చేయడం,
జాతీయ జలవిధానంలో సిఫార్సు చేసినట్లుగా జాతీయస్థాయిలో ఓ చట్టాన్ని రూపొందించడం, 1956
అంతర రాష్ట్ర జలవివాద చట్టం ప్రకారం ఉన్న నదీ బోర్డు స్థానంలో కొత్త నదీ యాజమాన్య చట్టాన్ని
తేవడం, మిగులు జలాలను ఆ నదీ పరివాహక రాష్ట్రానికి కాకుండా ఇంకో రాష్ట్రానికి తీసుకెళ్లినపుడు
నదుల అనుసంధానం కోసం జాతీయ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసి దీనికి అప్పీలు చేసుకునే అవకాశం
కల్పించడం తదితర సిఫార్సు చేసింది. 
- ఈ జాతీయ ట్రైబ్యునల్‌కు న్యాయపరమైన అధికారాలు ఉండాలంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 262
ప్రకారం ఈ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది.
- కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న శాశ్వత ట్రైబ్యునల్‌తో పాటు మరో ట్రైబ్యునల్‌ ఏర్పాటు
చేయడం అనవసరం అనుకుంటే, శాశ్వత ట్రైబ్యునల్‌ పరిధిలోకే నదుల అనుసంధానం ద్వారా
మళ్లించే నీటికి సంబంధించిన వివాదాలను కూడా చేర్చాలని కమిటీ సూచించింది. అవసరమైతే
అమలులో ఉన్న అంతర రాష్ట్రల ఒప్పందాలు, ట్క్రెబ్యునల్‌ అవార్డుల్లో కూడా మార్పు చేయడం
గురించి ఆలోచించాలని పేర్కొంది.

views: 941

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams