Current Affairs Telugu Daily

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ భారత పౌరసత్వం రద్దు 
తెలంగాణలోని వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ భారతదేశ పౌరసత్వం చెల్లదని కేంద్ర హోంశాఖ 2017 సెప్టెంబర్‌ 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని హోంశాఖ సంయుక్త కార్యదర్శి నిర్ధారించారు. రమేశ్‌ 2009 ఎన్నికల్లో, ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్‌ రమేశ్‌ పౌరసత్వాన్ని సవాలు చేశారు. ఆయనకు భారత పౌరసత్వం లేనందున ఎన్నికల్లో పోటీకి అనర్హుడని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన ఆయన సభ్యత్వాన్ని రద్ద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాను 2008 మార్చి 31న చట్ట ప్రకారం భారత పౌరసత్వం పొందానని రమేశ్‌ వివరణ ఇచ్చారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఆయన భారత పౌరసత్వం పొందారని శ్రీనివాస్‌ తెలిపారు. ఈ వివాదం హైకోర్టుకు చేరింది. విచారించిన న్యాయస్థానం ఆయన పౌరసత్వం  చెల్లదని 2013లో తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రమేశ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో ఆయనకు స్టే మంజూరైంది. 2014 సాధారణ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి రమేశ్‌ మళ్లీ పోటీ చేసి గెలుపొందారు. తర్వాత శ్రీనివాస్‌ మళ్లీ రమేశ్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2016 ఆగస్టు 11న సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 6 నెలల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. 6 నెలల గడువు సరిపోదని హోంశాఖ విన్నవించడంతో దాన్ని పెంచింది. ఆ గడువు 2017 సెప్టెంబర్‌ 5తో హోంశాఖ తుది ఆదేశాలిచ్చింది. 
views: 1068

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams