Current Affairs Telugu Daily

తెలంగాణకు మరో  2 జాతీయ రహదారులు 
తెలంగాణలో రెండు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతంలో మంజూరు చేసిన రెండు జాతీయ రహదారులకు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్రం తాజా ప్రకటనతో రాష్ట్రంలో జాతీయ రహదారుల సంఖ్య 25కు పెరుగుతుందని తెలంగాణ రహదారులు-భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
- రంగశాయిపేట(వరంగల్‌) నుంచి చింత నెక్కొండ, నెక్కొండ, కేసముద్రం మీదుగా మహబూబాబాద్‌ వరకు 71 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారి అభివృద్ధి చేసేందుకు కేంద్రం అంగీకరించింది.
- జాతీయ రహదారి 353 సి జంక్షన్‌ (భూపాల్‌పల్లి) నుంచి అన్షాస్‌పల్లి, గొర్లవీడు, నేరుడుపల్లి తండ(చైనపాక), గరిమిళ్లపల్లి, బూరపల్లి, ఎంపేడు, వావిలా, జమ్మికుంట, వీణవంక మీదుగా కరీంనగర్‌ వరకు 130 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్రం అంగీకరింది.  ఈ రెండు మార్గాలను కలుపుకుంటే తెలంగాణలో జాతీయ రహదారుల నిడివి 3,174 కిలోమీటర్లకు పెరుగుతుంది.
గతంలో ప్రకటించిన 2 జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.690 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌-బెంగళూరు 44వ జాతీయ రహదారి మార్గంలోని ఆరాంఘర్‌ నుంచి శంషాబాద్‌ వరకు ఉన్న మార్గాన్ని 6 వరసలకు విస్తరించేందుకు కేంద్రం గతంలో ఆమోదం తెలిపింది. ఆ విస్తరణ పనుకు తాజాగా రూ.290 కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్‌-నర్సాపూర్‌-మెదక్‌ మార్గంలోని 765డి జాతీయ రహదారిని రెండు వరుసలకు అభివృద్ధి చేసేందుకు రూ.400 కోట్లను కేంద్రం ప్రకటించింది. 

views: 1179

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams