Current Affairs Telugu Daily

కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ ఎండీగా పీఆర్‌ శేషాద్రి
కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా పి.ఆర్‌.శేషాద్రి బాధ్యతలు స్వీకరించారు. ఆరేళ్లకు పైగా ఈ బాధ్యతలు నిర్వర్తించిన కె.వెంకట్రామన్‌ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (బెంగళూరు)లో అభ్యసించిన శేషాద్రి, 25 సంవత్సరాల పాటు వాణిజ్య, రిటైల్‌ బ్యాంకింగ్‌లో అనేక హోదాల్లో పనిచేశారు. ఇంతకుముందు సిటీబ్యాంక్‌ ఇండియాలో వేర్వేరు బాధ్యతలు నిర్వర్తించారు. సిటీ ఫైనాన్షియల్‌ కన్జూమర్‌ పైనాన్స్‌, సిటీ ఫైనాన్షియల్‌ రిటైల్‌ సర్వీసెస్‌కు మేనేజింగ్‌ డైరెక్టరుగా శేషాద్రి పనిచేశారు. లండన్‌ కేంద్రంగా పనిచేసే బీఎఫ్‌సీ బ్యాంక్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా కూడా శేషాద్రి వ్యవహరించారు.
views: 1002



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams