Current Affairs Telugu Daily

తెలుగమ్మాయి శ్రీశుభకు ‘మిస్‌ ఇండియా 
 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు అమ్మాయి, అందా సుందరి శ్రీశుభ అద్దేపల్లి 2017 సంవత్సరానికి గాను ‘మిస్‌ ఇండియా సౌత్‌ ఆఫ్రికా గాటెంగ్‌’ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఇక్కడి ఓ ప్రముఖ బ్యాంకులో ఆమె 14 నెలల ఒప్పంద ఉద్యోగినిగా గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐటీ నిపుణురాలైన శ్రీశుభ...తన స్నేహితుల ప్రోత్సాహంతో ఈ పోటీలో నిలిచారు. ఎనిమిది మంది స్థానిక సుందరీమణులు ఆమెకు గట్టిపోటీ నిచ్చారు. పోటీ సందర్భంగా ఇతర విభాగాల్లోనూ ఆమె చక్కని ప్రతిభ కనబరిచారు. ఈ పోటీ సందర్భంగా శ్రీశుభ ఓ నృత్యప్రదర్శన ఇచ్చారు. కేవలం మూడు నిముషాల వ్యవధిలో తన జీవితానికి సంబంధించిన మూడు కీలక దశను తన నాట్యంతో అద్భుతంగా ఆవిష్కరించారామె. సున్నితభావజాలం, మృదు వర్తన ఉన్న కుటుంబ నేపథ్యం తనదని ఆమె చెప్పారు.
views: 1206

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams