Current Affairs Telugu Daily

బ్యాంకు ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను అడగరాదు: సుప్రీం
 బ్యాంకు ఉద్యోగుల వ్యక్తిగత వివరాల నుంచి 2006 జులై వరకు క్లరికల్‌ సిబ్బంది బదిలీలు, పోస్టింగ్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందజేయాలంటూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కెనరా బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సమాచారం అడిగిన వ్యక్తి బ్యాంకులో క్లరికల్‌ సిబ్బందిగా పనిచేస్తున్నారని.. ఆయన అడిగిన సమాచారం వ్యక్తిగతమైంది కాబట్టి సహ చట్టంలోని 8(జె) సెక్షన్‌ ప్రకారం దానికి మినహాయింపు ఉంటుందని జస్టిస్‌ ఆర్‌కే అగర్వాల్‌, జస్టిస్‌ ఏఎం సప్రే ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ వ్యక్తి కోరిన సమాచారం అందించడం వల్ల ఎలాంటి ప్రజోపయోగం లేదని పేర్కొంది.
views: 921

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams