Current Affairs Telugu Daily

యుద్ధ విమానాలతో అమెరికా శక్తి ప్రదర్శన 
ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా.. దక్షిణకొరియాలో భారీ బాంబర్లు, యుద్ధ విమానాల్ని ప్రదర్శించింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల్లో భాగంగా శక్తి ప్రదర్శన చేసింది. ఉత్తర కొరియా పదేపదే క్షిపణుల్ని పరీక్షిస్తుండటంతో ఆ దేశాన్ని ఎదుర్కోవడంలో భాగంగా ఇరుదేశాల వైమానిక దళాలు విన్యాసాల్ని చేపట్టినట్లు దక్షిణకొరియా వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది. రెండు బీ-1బి ల్యాన్సర్‌ బాంబర్లు అమెరికాకు చెందిన గువామ్‌ నుంచి, నాలుగు ఎఫ్‌-35బి యుద్ధవిమానాలు జపాన్‌లోని ఇవాకుని వైమానిక స్థావరం నుంచి విన్యాసాల్లో పాల్గొన్నట్లు తెలిపింది.
views: 884

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams