Current Affairs Telugu Daily

ఉత్తరాది కోళ్లఫారాల నుంచి పొలాలకు విస్తరిస్తున్న బాక్టీరియా: సీఎస్‌ఈ హెచ్చరిక
యాంటీబయోటిక్స్‌ను తట్టుకుని నిలిచే ఒక రకమైన బాక్టీరియా ఉత్తరాది రాష్ట్రాల్లోని కోళ్ల ఫారాల నుంచి పొలాలకు వ్యాపిస్తున్నట్లు బయటపడింది. పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల కోళ్ల ఫారాల నుంచి ‘శాస్త్ర-పర్యావరణ అధ్యయన సంస్థ’ (సీఎస్‌ఈ) కొన్ని నమూనాలను తీసుకుని విశ్లేషించింది. విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్‌ వాడడం వల్ల మొండిగా తయారైన బాక్టీరియా... పొలాలకూ విస్తరిస్తోందని హెచ్చరించింది. కోళ్ల పెంటను పొలాల్లో ఎరువుగా వాడుతున్నందువల్ల దాంతోపాటు బాక్టీరియా అక్కడకు చేరుకుంటోందని తెలిపింది. పొలాల నుంచి వ్యర్థాలను తరలించడంలో సురక్షిత పద్ధతులను పాటించకపోవడం వల్ల ఇప్పుడీ బాక్టీరియా నేరుగా వాతావరణంలోనూ కలిసిపోతోందని సీఎస్‌ఈ అధ్యయనంలో తేలినట్లు డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రభూషణ్‌వెల్లడించారు. యాంటీబయోటిక్స్‌కు లొంగని కొన్ని రకాల ప్రమాదకర బాక్టీరియా- మనుషులకు సోకితే ఏ మందులు వాడినా నయం కాదని చెప్పారు. పర్యావరణ మంత్రిత్వశాఖ, కాలుష్య నియంత్రణ మండళ్లు తక్షణం రంగంలో దిగి, చర్యలు చేపట్టాలని సూచించారు.
views: 902

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams