Current Affairs Telugu Daily

ఆ వినాయకుడి విగ్రహం రూ.4.5 లక్షలు 
పోర్సిలైన్‌ లోహంతో తయారు చేసిన ఖరీదైన విగ్రహాను, శిల్పాను విక్రయిస్తున్న స్పానిష్‌ కంపెనీ యాద్రో వినాయక చవితి సందర్భంగా దేశీయ విపణిలోకి ప్రత్యేక వినాయక (లిమిటెడ్‌ ఎడిషన్‌) విగ్రహాలను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ.4.5 లక్షలు. బహుమతులు, గృహ అంకరణ కోసం పోర్సిలైన్‌తో 500 రకాల విగ్రహాలను యాద్రో తయారు చేస్తోంది. భారత్‌లో 200 రకాల వరకూ విక్రయిస్తోంది. ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో భారతీయ దేవతా విగ్రహాలను, గాంధీ వంటి ప్రముఖుల విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో తమకు 8 బొటిక్‌లు ఉన్నాయని, రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు ఖరీదైన విగ్రహాలు భారత్‌లో అధికంగా విక్రయం అవుతున్నాయని యాద్రో ఇండియా సీఈఓ నిఖిల్‌ లంబా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా యాద్రో 120 దేశాల్లో పోర్సిలైన్‌ శిల్పాలను విక్రయిస్తోంది. ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో భారత్‌ వాటా 6-7 శాతం ఉంటుందని, విక్రయాల్లో ఏటా 12-15 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నామని వివరించారు. యాద్రో విక్రయించే శిల్పాల్లో ‘కార్నివాల్‌ ఇన్‌ వెనిస్‌’ ధర అత్యధికంగా రూ.1.66 కోట్లు. వాలెన్సియాలోని ఫ్యాక్టరీలో మాత్రమే ఈ విగ్రహాలను కంపెనీ తయారు చేస్తుంది. ఒక్కో విగ్రహాన్ని తయారు చేయడానికి 6 నెలల నుంచి సంవత్సరం పడుతుందని లంబా తెలిపారు. వేంకటేశ్వర స్వామి శిల్పాలను తయారు చేసే ఆలోచన ఉన్నట్లు చెప్పారు.
views: 956

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams