Current Affairs Telugu Daily

బ్రిడ్జ్‌స్టోన్‌కు సింధు ప్రచారం 
 బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధును ప్రచారకర్తగా టైర్ల తయారీ కంపెనీ బ్రిడ్జ్‌స్టోన్‌ నియమించుకుంది. బ్రిడ్జ్‌స్టోన్‌కు సింధు తొలి స్థానిక ప్రచారకర్తని బ్రిడ్జ్‌స్టోన్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కాజుతోషి ఒయామా తెలిపారు. 2016 రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సింధు రజత పతకాన్ని కైవశం చేసుకుంది. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ రజత పతకాన్ని దక్కించుకుంది. కంపెనీతో కుదిరిన ఒప్పందం ప్రకారం బ్రిడ్జ్‌స్టోన్‌కు సింధు మూడేళ్లు ప్రచారం చేస్తారు. ప్రపంచ వ్యాప్త ఒలింపిక్‌ భాగస్వామిగా బ్రిడ్జ్‌స్టోన్‌ ఉంది. సింధు విజయాలు యువతకు స్పూర్తిదాయకమని, కలలు తీరే వరకు కష్టపడాన్న (ఛేజ్‌ ద డ్రీమ్‌) సందేశాన్ని ఇస్తున్నాయని బ్రిడ్జ్‌స్టోన్‌ ఏషియా పసిఫిక్‌ పీటీఈ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, సీఈఓ ఫ్రాంకో అనున్‌జియాటో అన్నారు. ఆమెలోని విజయం సాధించాలనే శైలి తమ కంపెనీ విధానానికి సరిగ్గా సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. భారత్‌లో తొలి ప్రచారకర్తగా బ్రిడ్జ్‌స్టోన్‌ తనను నియమించడం ఆనందం కలిగిస్తోందని, దీన్ని తాను ఒక గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. భారత్‌ ప్రజలు తన నుంచి మరిన్ని విజయాలను కోరుకుంటున్నారని మరింత బాగా ఆడేందుకు శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. తన ప్రయాణం ఇప్పుడే  ప్రారంభమైందని, ఇంకా ప్రయాణించాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు.
views: 1015

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams