Current Affairs Telugu Daily

రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు ఇప్పుడు కనిపించింది
 రెండో ప్రపంచయుద్ధ సమయంలో బ్రిటన్‌ జర్మనీపై వేసిన బాంబు ఒకటి తాజాగా ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో బయటపడింది. 1400 కిలోలు ఉన్న ‘బ్లాక్‌బస్టర్‌’ అనే ఈ బాంబును స్థానిక గోథీ యూనివర్సిటీ సమీపంలోని వెస్టెండ్‌ క్యాంపస్‌ వద్ద 2017 ఆగస్టు 29న కనుగొన్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ, సెప్టెంబరు 3న పోలీసు దాన్ని నిర్వీర్యం చేయనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా దాదాపు 70వేల మంది స్థానికుల్ని పోలీసు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. యుద్ధానంతరం జర్మనీలో ఇంత భారీ స్థాయిలో ప్రజలను మరో ప్రదేశానికి తరలించడం ఇదే ప్రథమమని అక్కడి పోలీసు తెలిపారు.
views: 1133

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams