Current Affairs Telugu Daily

పాఠశాలలు పుస్తకాలు విక్రయించవచ్చు 
 కేంద్ర మాధ్యమిక విద్యా మండలి(సీబీఎస్‌ఈ) ఏప్రిల్‌లో తన అనుబంధ పాఠశాలకు జారీచేసిన మార్గదర్శకాలకు సవరణలు చేసింది. దీనిప్రకారం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల్లో పుస్తకాల విక్రయశాలలు ఏర్పాటుచేసుకోవచ్చు. వీటిల్లో విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ వస్తువుతో పాటు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు విక్రయించవచ్చు. గత ఏప్రిల్‌లో విడుదల చేసిన సూచనల్లో పాఠశాలల్లో ఎటువంటి వ్యాపార దుకాణాలను ఏర్పాటుచేయవద్దని, బడి ఆవరణల్లో పుస్తకాలు, ఏకరూప దుస్తులు అమ్మకూడదని తెలిపింది. తాజా సవరణ ప్రకారం పాఠశాలలు తమ వెబ్‌సైట్‌ ద్వారా పుస్తకాలు విక్రయించవచ్చు. దీనికోసం అవసరమైతే బడి ఆవరణలో ఒక పుస్తక విక్రయశాలను సైతం ఏర్పాటు చేసుకోవచ్చని ఇటీవల జారీచేసిన ప్రకటనలో పేర్కొంది.
views: 879

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams