Current Affairs Telugu Daily

జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం
హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా జరిగిన జాతీయ క్రీడా అవార్డు పురస్కార కార్యక్రమం 2017 ఆగస్టు 29న వైభవంగా జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుకల్లో అత్యున్నత రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డును పారాలింపియన్‌ దేవేంద్ర జజరియాతో పాటు హాకీ సీనియర్‌ ప్లేయర్‌ సర్దార్‌ సింగ్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకున్నారు. వీరికి జ్ఞాపికతో పాటు రూ.7.5 లక్షల చొప్పున చెక్‌ను అందించారు. 2004 ఏథెన్స్‌, 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా జావెలిన్‌ త్రోయర్‌ జజరియా నిలిచాడు. గత కొన్నేళ్లుగా మిడ్‌ ఫ్డీర్‌ సర్దార్‌ సింగ్‌ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే 17 మంది క్రీడాకారులు అర్జున అవార్డు దక్కించుకోగా కౌంటీ మ్యాచ్‌ల్లో ఆడుతున్న కారణంగా క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు. మిగతా వారంతా అర్జునను స్వీకరించారు. ఇందులో తెలుగు తేజాలు సాకేత్‌ మైనేని (టెన్నిస్‌), జ్యోతి సురేఖ (ఆర్చరీ) కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీఎస్‌ఎస్‌వీ ప్రసాద్‌ ద్రోణాచార్య (లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌), ఫుట్‌బాల్‌ క్రీడాభివృద్ధికి గుర్తింపుగా తెలంగాణకు చెందిన ఒలింపియన్‌ సయ్యద్‌ షాహిద్‌ హకీమ్‌ ధ్యాన్‌చంద్‌ అవార్డును అందుకున్నారు.
రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ అవార్డును రిలయన్స్‌ ఫౌండేషన్‌ యూత్‌ స్పోర్ట్స్‌ తరఫున నీతా అంబానీ స్వీకరించారు. అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ అవార్డు గ్రహీతలు జ్ఞాపిక, సర్టిఫికెట్‌తో పాటు రూ. 5 లక్షల చొప్పున చెక్‌ను అందుకున్నారు.
అవార్డు గ్రహీతలు : 
ఖేల్‌రత్న : 
1. దేవేంద్ర జజరియా(పారాథ్లెట్‌, జావెలిన్‌ త్రో)
2. సర్దార్‌సింగ్‌ (హాకీ)
అర్జున : 
1. సాకేత్‌ మైనేని (టెన్నిస్‌)
2. జ్యోతి సురేఖ (ఆర్చరీ)
3. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (క్రికెట్‌)
4. ఖుష్బీర్‌ కౌర్‌ (అథ్లెటిక్స్‌)
5. రాజీవ్‌ (అథ్లెటిక్స్‌)
6. ప్రశాంతి సింగ్‌ (బాస్కెట్‌బాల్‌)
7. దేవేంద్రో సింగ్‌ (బాక్సింగ్‌)
8. బెంబేమ్‌ దేవి (ఫుట్‌బాల్‌)
9. ఎస్‌ఎస్‌పీ చౌరాసియా (గోల్ఫ్‌)
10. ఎస్‌వీ సునీల్‌ (హాకీ)
11. జస్వీర్‌ సింగ్‌ (కబడ్డీ)
12. ప్రకాష్‌ నంజప్ప (షూటింగ్‌)
13. ఆంథోనీ అమల్‌రాజ్‌ (టీటీ)
14. సత్యవర్త్‌ కడియాన్‌ (రెజ్లింగ్‌)
15. తంగమే (పారా అథ్లెట్స్‌)
16. వరుణ్‌ భటి (పారా అథ్లెట్స్‌)
17. పుజారా (క్రికెట్‌)
ద్రోణాచార్య : 
1. దివంగత డాక్టర్‌ ఆర్‌.గాంధీ (అథ్లెటిక్స్‌)
2. జీఎస్‌ఎస్‌వీ ప్రసాద్‌ (బ్యాడ్మింటన్‌)
3. బీబీ మహంతి (బాక్సింగ్‌)
4. హీరానంద్‌ (కబడ్డీ)
5. రాఫెల్‌ (హాకీ)
6. సంజయ్‌ చక్రవర్తి (షూటింగ్‌)
7. రోషన్‌ లాల్‌ (రెజ్లింగ్‌)
ధ్యాన్‌చంద్‌ : 
1. భూపిందర్‌ సింగ్‌ (అథ్లెటిక్స్‌)
2. సయ్యద్‌ షాహిద్‌ హకీమ్‌ (ఫుట్‌బాల్‌)
3. సుమరాయ్‌ టెటే (హాకీ)

views: 1174

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams