Current Affairs Telugu Daily

నవకల్పనలో చైనాను అధిగమించనున్న భారత్‌ : బ్రిక్స్‌ నివేదిక 
భారత నూతన ఆవిష్కరణ అభివృద్ధి రేటు మున్ముందు ఒక్కసారిగా పెరిగిపోనుంది. వచ్చే దశాబ్దంలో ఈ విషయంలో చైనాను భారత్‌ అధిగమించి ముందుకు దూసుకువెళుతుంది. 2017 ఆగస్టు 29న విడుదలైన బ్రిక్స్‌ నివేదిక ఈ విషయాన్ని పేర్కొంది. జాతీయ సమగ్ర నవకల్పన విషయంలో 2016లో చైనా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, భారత్‌లు ఉన్నట్లు బిక్స్‌ నివేదిక తెలిపింది. 2025-30 మధ్యకాలంలో ఈ దిశగా భారత్‌ చురుగ్గా ముందడుగువేసి చైనాను అధిగమించవచ్చునని అభిప్రాయపడింది. సైన్స్‌, సాంకేతిక, నవకల్పన సమగ్ర పోటీతత్వం విషయాల్లో 2030 నాటికి రష్యా ప్రగతి రేటు పడిపోయి భారత్‌ కాస్తా ఆ స్థానానికి ఎగబాకుతుందని బ్రిక్స్‌ నివేదిక పేర్కొంది. 2017 సెప్టెంబరు 3 నుంచి 5వ తేదీ వరకూ చైనాలో జరిగే బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ఈ నివేదికను విడుదల చేశారు.
views: 1081

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams