Current Affairs Telugu Daily

తెలంగాణలో జూన్‌ 1 నుంచే కొత్త విద్యా సంవత్సరం
పాఠశాలలకు వచ్చే విద్యా సంవత్సరం (2018-19) జూన్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలంటే జూన్‌ 1 నుంచే పాఠశాలు పునఃప్రారంభించాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం 2018 ఏప్రిల్‌ 12వ తేదీతో ముగుస్తుంది. 2018 ఏప్రిల్‌ 13 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తారు. ఈ మేరకు విద్యాశాఖ పాఠశాల టైమ్‌ టేబుల్‌ను 2017 ఆగస్టు 29న విడుదల చేసింది. దీని ప్రకారం పాఠ్య ప్రణాళికను ఫిబ్రవరి 28వ తేదీతో పూర్తి చేయాలి. గతంలో ఉన్నత పాఠశాలకు ఆప్షనల్‌ హాలిడేస్‌ ఉండేవి. ఇకపై ఉండవు. ఐచ్ఛిక సెలవు పేరుతో ఉన్నత పాఠశాలు మూయడానికి వీల్లేదు. ఆ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో 30 శాతం మంది మాత్రం ఐచ్ఛిక సెలవు తీసుకోవచ్చు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలకు మాత్రం గతంలోని నిబంధనలే వర్తిస్తాయి. 
views: 1334

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams