Current Affairs Telugu Daily

జపాన్‌ మీదుగా ఉత్తర కొరియా ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం
ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా జపాన్‌ మీదుగా 2017 ఆగస్టు 29న బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. ఉత్తర కొరియా చర్యను జపాన్‌ తీవ్రంగా ఖండించింది. టోక్యోలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి అమెరికా, దక్షిణ కొరియాతో కలిసి పిలుపునిచ్చింది. ‘ఇది చాలా తీవ్రమైన, సహించలేని విపరీత చర్య’అని జపాన్‌ ప్రధాని షింజో అబే వ్యాఖ్యానించారు. ఉత్తర జపాన్‌లో క్షిపణి ప్రయాణించిన మార్గంలో ప్రమాద ఘంటికలు మోగాయి. పరిసరాల్లోని భవనాల్లోకి వెళ్లిపోవాలని ప్రజలకు వెంటవెంటనే హెచ్చరికలు జారీఅయ్యాయి. ప్రయాణికులందరూ స్టేషన్లలోనే ఉండిపోవాలని సూచించడంతో రైలు సేవలకు అంతరాయం కలిగింది.  అన్ని రైలు మార్గాలపైనా ప్రభావం పడిందని సప్పొరోస్‌ మెట్రో వ్యవస్థ తెలిపింది. 2009లో సైతం జపాన్‌ మీదుగా ఓ ఉత్తర కొరియా రాకెట్‌ దూసుకెళ్లింది. అయితే అది ఉపగ్రహ ప్రయోగమని ఉత్తర కొరియా తెలిపింది. తాజాగా ప్రయోగించింది మాత్రం ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ఐసీబీఎం)అని అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ గట్టిగా నమ్ముతున్నాయి. గత నెలలో సైతం ఉత్తర కొరియా రెండు ఐసీబీఎం పరీక్షలు చేపట్టింది. అమెరికాలో చాలా ప్రాంతాలపై దాడిచేయగ సామర్థ్యమున్న క్షిపణి తమదగ్గరుందనే సంకేతమిచ్చింది. దీంతో పూర్తిగా దేశాన్నే లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అనంతరం అమెరికాకు చెందిన గువామ్‌ దీవులపై క్షిపణిని ప్రయోగిస్తామని ఉత్తర కొరియా హెచ్చరికలు జారీ చేసింది. తాజా క్షిపణి 550 కి.మీ. గరిష్ట ఎత్తులో 2,700 కి.మీ. దూరం ప్రయాణించిందని దక్షిణ కొరియా తెలిపింది. జపాన్‌కు చెందిన హొక్కాయిడో దీవులపై నుంచి దూసుకెళ్లి ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రంలో పడిందని వెల్లడించింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లోని సునాన్‌ నుంచి దీన్ని ప్రయోగించినట్లు పేర్కొంది. ఉత్తర కొరియా నుంచి గువామ్‌ ఆగ్నేయ దిశగా 3500 కి.మీ. దూరంలో ఉంది. పైగా తాజా క్షిపణిని తూర్పు దిశగా జపాన్‌ వైపు ప్రయోగించారు. 
views: 1056

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams