Current Affairs Telugu Daily

పట్టణ పేదలకు మరో 2.17 లక్షల ఇళ్లు 
పట్టణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం మరో 2.17 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. దీంతో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) కింద మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య 26.13 లక్షలకు పెరిగిందని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకానికి మొత్తం రూ.1.39 లక్షల కోట్లు వ్యయం కానుండగా, కేంద్రం వాటా రూ.40,597 కోట్లుగా ఉంది. తాజాగా 6 రాష్ట్రాకు ఇళ్లు మంజూరు చేశారు. 
1.    ఆంధ్రప్రదేశ్‌    1.20 లక్షలు
2.    ఉత్తర్‌ప్రదేశ్‌    41,173
3.    అసోం    16,700
4.    గుజరాత్‌    15,222
5.    జార్ఖండ్‌    14,017
6.    మహారాష్ట్ర    9,894
ఈ పథకం కింద ప్రతిపాదించిన మొత్తం ఇళ్లలో 82 శాతాన్ని 10 రాష్ట్రాలకు కేటాయించారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, బిహార్‌లు ఉన్నాయి. ఢిల్లీ, చండీగఢ్‌, గోవా, లక్షద్వీప్‌ మినహా అన్ని రాష్ట్రాలకు ఇళ్లు మంజూరయ్యాయి. అందుబాటు ధరల్లో గృహనిర్మాణం (ఆఫర్డబుల్‌ హౌసింగ్‌) విధానం కింద ఆంధ్రప్రదేశ్‌కు అత్యధికంగా 20.71 శాతం ఇళ్లు పొంది దేశంలో తొలిస్థానంలో నిలిచింది. తాజా కేటాయింపుతో పాటు, ఇంతవరకు 5,41,330 ఇళ్లు మంజూరయ్యాయి. 

views: 1015

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams