Current Affairs Telugu Daily

అంతర్జాతీయ ఉపన్యాస పోటీలో విజేతగా భారత సంతతి వ్యక్తి 
కెనడాలో నిర్వహించిన అంతర్జాతీయ ఉపన్యాస పోటీలో సింగపూర్‌కు చెందిన భారత సంతతి వ్యక్తి మనోజ్‌ వాసుదేవన్‌(43) విజేతగా నిలిచారు. సింగపూర్‌లో శాశ్వత నివాసి, ఇంజినీరైన మనోజ్‌ వాసుదేవన్‌ సహజసిద్ధమైన ఉపన్యాసకుడు కాకపోయినా, 2009లో సాధన ప్రారంభించారు. తనకు తాను శిక్షణ పొందేందుకు కార్యక్రమాల నిర్వాహకుడిగా, హాస్యకారుడిగా మారారు. పోటీ సందర్భంగా ప్రసంగంలో రాజీ, ఐక్యత ద్వారా ఆనందకరమైన దాంపత్య జీవితంపై ఆయనిచ్చిన సందేశం టోస్ట్‌మాస్టర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రపంచ ఉపన్యాస ఛాంపియన్‌షిప్‌లో న్యాయనిర్ణేతల్ని మెప్పించి స్వర్ణాన్ని సాధించింది. మనోజ్‌ గెలుపుతో సింగపూర్‌ వరుసగా రెండేళ్లు ఛాంపియన్‌షిప్‌ను సాధించినట్లయింది.
views: 1066

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams