తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ డైరెక్టర్ల బోర్డు కమిటీని ప్రభుత్వం నియమించింది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ సంస్థ ఎండీ, పురపాలక శాఖ కార్యదర్శి, తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ, హౌజింగ్ బోర్డు కమిషనర్ డైరెక్టర్లుగా ఉంటారు.
views: 856