Current Affairs Telugu Daily

నగదు లావాదేవీలు రూ.2 లక్షలకు మించితే భారీ జరిమానా 
నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ఆదాయపు పన్ను శాఖ నగదు లావాదేవీలపై ఆంక్షలను తీవ్రతరం చేసింది. రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు నిర్వహించే వారికి చట్టప్రకారం భారీ జరిమానా విధించనున్నట్లు 2017 ఆగస్టు 28న హెచ్చరించింది. దీని ప్రకారం ఒక వ్యక్తి నుంచి రోజుకు ఒకటి లేదా అంతకుమించిన లావాదేవీల్లో రూ.2 లక్షలకు మించి నేరుగా నగదును స్వీకరించరాదు. స్థిరాస్తు క్రయవిక్రయాల్లో ఈ పరిమితి రూ.20 వేలే. అదే వ్యాపారపరమైన వ్యయాలు, వృత్తిసంబంధిత అంశాల్లో అయితే రూ.10 వేలే. అంతకు మించి నగదు చేతులు మారటానికి వీల్లేదని ఐటీ శాఖ విస్పష్టం చేసింది. ఎవరైనా నిషేధ ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలిస్తే సమీపంలో ఉండే ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్‌ కమిషనర్‌కు నేరుగా లేదా blackmoneyinfo@ incometax.gov.in కు ఈమెయిల్‌ ద్వారా తెలియజేయాని ప్రజకు విజ్ఞప్తి చేసింది. రూ.2 లక్షలకు మించిన నగదు లావాదేవీలను 2017 ఏప్రిల్‌ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధం ప్రభుత్వ చెల్లింపుకు, పోస్టాఫీసులు, బ్యాంకులు, సహకార బ్యాంకుల్లో చేసే పొదుపునకు వర్తించదు.
views: 974

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams