Current Affairs Telugu Daily

ఐఐటీలు, కేంద్రియ వర్సిటీల్లో దేశభక్తి రాక్‌ షోలు
ఐఐటీలు, కేంద్రియ విశ్వవిద్యాయాల్లో విద్యార్థులు త్వరలో దేశభక్తి సంగీతంలో ఓలాలడనున్నారు. ఇందుకోసం ప్రత్యేక రాక్‌ బ్యాండ్‌లు.. ఈ విద్యా సంస్థ ప్రాంగణాలను సందర్శించనున్నాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల మంత్రితత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ‘యే ఇండియా కా టైమ్‌ హై’ పేరిట నిర్వహించబోయే ఈ కార్యక్రమం కోసం దాదాపు డజను బ్యాండ్లను గుర్తించారు. ఇందుకోసం ఒక ప్రైవేటు వినోద కార్యక్రమా సంస్థ సాయాన్ని ప్రభుత్వం తీసుకుంది. సదరు బ్యాండ్‌ సభ్యులు దేశభక్తి గేయాలను.. ముఖ్యంగా బాలీవుడ్‌లో వచ్చిన పాటను ఆపించనున్నారు. ఈ ఏడాది.. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు పూర్తికావడంతో పాటు క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
views: 1001

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams