Current Affairs Telugu Daily

తాజా కూరగాయలతో ఆరోగ్యం 
 తాజా కూరగాయలు, పండ్లతో ఆరోగ్యం సమకూరుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్ది అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం.. తాజా కూరగాయలను అందించడానికి కృషి చేస్తోందని, పండించుకునే విధానాన్నీ నేర్పుతోందని చెప్పారు. ఇటీవల రైతు బజార్లతో పాటు.. మన కూరగాయల దుకాణాను అందుబాటులోకి తెచ్చి.. పంట పొలా నుంచి నేరుగా వినియోగదారుడికి అందిస్తున్నామన్నారు.2017 ఆగస్టు 27  హుస్సేన్‌సాగర్‌ చెంతన నెక్లెస్‌ రోడ్డులో రాష్ట్ర ఉద్యానశాఖ ఏర్పాటు చెసిన ‘తెలంగాణ ఉద్యాన మహోత్సవం-2017’ను పోచారం ప్రారంభించారు. 133 స్టాళ్లతో.. 25 ప్రభుత్వ.. ప్రభుత్వేతర సంస్థలు ప్రదర్శనలో పాలుపంచుకున్నాయి. కూరగాయల సాగు.., సేంద్రీయ ఎరువు వాడకం, సాగు పనిముట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఈనెల 31 వరకూ ఉంటుంది. మంత్రి మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనేది తమ లక్ష్యమన్నారు. ఈ దిశగా కూరగాయల పంటలకు రాష్ట్రప్రభుత్వం రైతును ప్రోత్సహిస్తోందన్నారు. నగరాల్లో స్థలాభావం వల్ల మిద్దెపైన పంటు పండిరచుకునేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా.. సగం ధరకు కూరగాయల సాగుకు పనిముట్లు, ఎరువు, విత్తనాలను అందిస్తున్నామన్నారు. నగరంతో పాటు రాష్ట్రానికి అవసరమైన కూరగాయలు, పండ్లను ఇక్కడే పండించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 10,800 రెవెన్యూ గ్రామాలను 3,600 యూనిట్లుగా విభజించి సెప్టెంబరు 1 నుంచి 9 వరకూ గ్రామ రైతు సమన్వయ సంఘాలను, 10 నుంచి 14లోగా మండల రైతు సమన్వయ సంఘాలను ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత సదస్సును ఏర్పాటుచేసి కూరగాయల సాగుకు ప్రోత్సహిస్తామని చెప్పారు. రైతు సమగ్ర సర్వే వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి సమన్వయకర్త, ఏఈవో సంతకాలతో కూడిన రికార్డు ఆధారంగా వచ్చే ఏడాది మే 15నాటికి ఎకరాకు రూ.4 వేలు  నగదును రైతు ఖాతాలోకి బదిలీ చేస్తామన్నారు. రెండు పంటలు పండించే ఉద్యాన రైతుకు ఏడాదికి రూ.8 వేలు నగదు అందుతుందని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో శాసనసభ్యులు మదన్‌మోహన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ లోక భూమారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ హరీశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, ఉద్యానశాఖ కమిషనర్‌ ఎల్‌.వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
views: 959

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams