Current Affairs Telugu Daily

డయల్‌ 18004254440 
 రాష్ట్రానికి ఆవల ఉన్నవారు ఏపీ ప్రభుత్వం దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకురాదలుచుకుంటే 18004254440 నెంబరుకు ఫోన్‌ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఈ నెంబరును ఆయన 2017 ఆగస్టు 22న మీడియాకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 1100 పరిష్కార వేదిక కాల్‌ సెంటరు నెంబరుకు రాష్ట్రానికి ఆవల ఉన్నవారు ఫిర్యాదు చేయాలంటే సమస్యలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడ ఇదే నెంబరుతో కాల్‌ సెంటరును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజలు అక్కడి నుంచి ఇక్కడ తమ వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేయాలంటే వీలు కావడం లేదు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఈ ఏర్పాటు చేయించారు.
views: 1096

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams