ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ పదవికి విశాల్ సిక్కా రాజీనామా
ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ పదవికి విశాల్ సిక్కా ఆగస్టు 18న రాజీనామా చేశారు. పదేపదే వ్యక్తిగతంగా మాటల దాడి చేయడంతోపాటు నిరాధార ఆరోపణలు గుప్పించడంతో తీవ్ర మనస్థాపానికి గురైరాజీనామా చేశానంటూ పేర్కొన్నారు. సిక్కా రాజీనామాను ఆమోదించామని. ఆయన స్థానంలో తాత్కాలిక సీఈఓ, ఎండీగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) యూబీ ప్రవీణ్‌రావుకు తక్షణం బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇన్ఫీ బోర్డు ప్రకటించింది. ఇక పూర్తి స్థాయి సీఈఓ-ఎండీని నియమించేందుకు 2018, మార్చి 31ని బోర్డు డెడ్‌లైన్‌గా నిర్ణయించారు.
views: 955