Current Affairs Telugu Daily

కేరళలో రెండు కొత్త వానపాము జాతుల గుర్తింపు
కేరళలోని పశ్చిమ కనుమల్లో శాస్త్రవేత్తలు రెండు కొత్తరకం వానపాము జాతులను గుర్తించారు. వీటికి ద్రవిడ డైవర్జిక్యుట, ద్రవిడ తోమసిగా నామకరణం చేశారు. అయితే కొత్తగా గుర్తించిన ఈ రెండు జాతుల  మధ్య కూడా చాలా తేడాలున్నాయని కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, హిమాచల్‌ ప్రదేశ్‌లోని స్కూలిని యూనివర్సిటీ పరిశోధకు వెల్లడించారు. ద్రవిడ డైవర్జిక్యులేట ఒంటిపై పదుల సంఖ్యలో ఖండికలుండగా అవయవాన్నీ శరీరానికి ముందు భాగంలో ఉన్నాయి. మున్నార్‌ ప్రాంతంలోని షోలా గడ్డి భూములు, ఎరావికుళం నేషనల్‌ పార్క్ లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది.ఇక ద్రవిడ తోమసిగా నామకరణం చేసిన మరో జాతిని కొజిప్పారా జలపాతం సమీపంలోని భూముల్లో గుర్తించారు. ఈ రెండు వానపాములు కూడా మోనిలిగాస్ట్రిడే జాతికి చెందిన జీవు.
views: 1132

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams