Current Affairs Telugu Daily

బంగారం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం
22 క్యారెట్లకుపైన స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తుల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. బంగారం ఉత్పత్తుల రౌండ్ట్రిప్పింగ్ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 8 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల వరకు స్వఛ్ఛత గల బంగారం ఎగుమతులకు మాత్రమే అనుమతున్నాయని డెరైక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్టీ) ఒక ప్రకటనలో తెలిపింది. 22 క్యారెట్లలోపు స్వచ్చత గల బంగారం ఉత్పత్తులను ఎగుమతి చేసే వారికే ప్రోత్సాహకాలు లభిస్తాయని పేర్కొంది. కొందరు ఎగుమతిదారులు 22 క్యారెట్లకుపైన స్వచ్ఛతగరుల బంగారం ఉత్పత్తురులకు కొంత విలువను జోడించి ఎగుమతి చేయడం ద్వారా ప్రోత్సాహకాలు పొందుతున్నారని జెమ్స్‌ అండ్‌ జవెరీ ఎక్స్పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌(జీజేఈపీసీ) తెలిపింది.
views: 1099

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams