Current Affairs Telugu Daily

షాంఘై ర్యాంకింగ్స్‌లో హార్వర్డ్‌కు ప్రదమ స్థానం
షాంఘై ర్యాంకింగ్‌ కన్సల్లెన్సీ విడుదల చేసిన ‘అకడమిక్‌ ర్యాంకింగ్స ఆఫ్‌ వరల్డ్‌ యూనివర్సిటీస్‌’’లో అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం మొదటి ర్యాంకు సాధించింది. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ రెండో ర్యాంకు, మసాచుసెట్స్‌ టెక్నాలజీ వర్సిటీ మూడో ర్యాంకు, కాలిఫోర్నియా వర్సిటీ నాల్లో ర్యాంకు సాధించాయి. ప్రిన్స్‌ టన్‌, ఆక్స్‌ఫర్డ్‌, కొలంబియా, కాలిఫోర్నియా టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌, షికాగో వర్సిటీలు తొలి 10 జాబితాలో స్థానం పొందాయి. చైనాలోని ప్రతిష్టాత్మకమైన సింగువా వర్సిటీ తొలిసారిగా టాప్‌ 50లో చోటు దక్కించుకుంది, ఆసియా నుంచి మెరుగైన ర్యాంకు పొందిన వాటిలో టోక్యో యూనివర్సిటీ24) ఉంది, యూరప్‌ నుంచి స్విస్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ఉత్తమ ర్యాంకు పొందింది. 2003 నుంచి షాంఘై సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమమైన తొలి 500 విద్యాసంస్థలకు ర్యాంకు ప్రకటిస్తోంది.
views: 1087

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams