Current Affairs Telugu Daily

మెట్రో రైలు పాలసీ - 2017
దేశవ్యాప్తంగా మెట్రో రైలు నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేయడానికి కేంద్రం నూతన మెట్రో రైలువిధానం 2017 ని ఆమెదించింది. ప్రైవేట్‌ రంగంతో పాటు ఇతర మార్గాలైన వాల్యూ క్యాప్చర్‌ ఫైనాన్స్టింగ్‌ (విసిఎఫ్‌), బాండ్ల జారీతో నిధులు సేకరించేందుకు ఇందులో చర్యలు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 16న ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం తాము చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందాలంటే రాష్ట్రాలు ప్రైవేట్‌ సంస్థలతో జట్టుకట్టడం తప్పనిసరి చేశారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా పట్టణా అభివృద్ధి, వ్యయం తగ్గింపునకు ఈ విధానంలో ప్రాధాన్యమిచ్చారు. మెట్రో ప్రాజెక్టు అమలుకు ఏకీకృత నిబంధనను రూపొందించడంతో పాటు, నిధుల సేకరణకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. 
మెట్రో రైలు పాలసీ-2017 ముఖ్యాంశాలు
- నిధుల డిమాండ్‌ ను తట్టుకోవాలంటే ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం తప్పనిసరి.
- మొత్తం ప్రాజెక్టులో లేదా అనుబంధ విభాగాలైన చార్టీల వసూలు, నిర్వహణలో ప్రైవేట్‌ సంస్థ పాలుపంచుకోవాలి.
- ప్రైవేట్‌ రంగంలోని వనరులు, నిపుణత, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవడానికే ఈ నిర్ణయం.
- స్టేషన్‌లో వాణిజ్య ఆస్తుల అభివృద్ధి, స్థలాల లీజు, వాణిజ్య ప్రకటన ద్వారా లభించే ఆదాయానికి సంబంధించి తీసుకునే
 చర్యను రాష్ట్రాలు తమ ప్రాజెక్టు రిపోర్టులో సవివరంగా తెలియజేయాలి.
- సమయానుగుణంగా చార్జీలను సవరించేలా నిబంధనల మార్పునకు, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్రాలకు అధికారం కల్పించారు.
కేంద్రం నుంచి విధులు పొందే మార్గాలు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌, కేంద్ర గ్రాంట్లు ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం)
50:50 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఈక్విటీషేరింగ్‌
విద్యా సిస్తో నిధి: సెకండరీ, ఉన్నత విద్య ద్వారా సమకూరేసెస్‌ నిధులతో కార్పస్‌ ఫండ్‌ ను ఏర్పాటు చేయాలని
కేంద్రం నిర్ణయించింది. ‘‘మాధ్యమిక్‌ అండ్‌ ఉఛ్చతర్‌ శిక్షా కోశ్‌’(ముస్కగా పిలిచే ఈ నిధి మానవ వనరు శాఖ
నిర్వహణలో కొనసాగుతుంది, ముస్క నిధును మాధ్యమిక, ఉన్నతవిద్య పథకాలకు వెచ్చిస్తారు.

views: 1012

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams