Current Affairs Telugu Daily

కొడ్కెకెనాల్‌లో ఇరోమ్‌ షర్మిళ వివాహం 
మణిపూర్‌ ఉక్కు మహిళల ఇరోమ్‌ షర్మిళ తమిళనాడులోని కొడ్కెకెనాల్‌లో 2017 ఆగస్టు 17న వివాహం చేసుకున్నారు. బ్రిటీష్‌ పౌరుడు డెస్మండ్‌ కౌటిన్‌తో స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆమె పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ప్రత్యేక వివాహల చట్టం 1954 ప్రకారం జరిగిన ఈ వివాహానికి ఇరువురి తరఫున బంధువులు ఎవరూ హాజరుకాలేదు. షర్మిళ మొబైల్‌ ఫోనులోనే తన తల్లిదండ్రులను సంప్రదించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రశాంతత కోసం తాను అనేక ప్రాంతాలు వెతికానని.. కొడ్కెకెనాల్‌లో తన అన్వేషణ ముగిసిందన్నారు. స్థానికంగా కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల హక్కు కోసం పోరాడతానని స్పష్టం చేశారు.
views: 1013

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams