Current Affairs Telugu Daily

సలహా మండళ్లలను రద్దు చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ 
పారిశ్రామికవేత్తలతో ఏర్పాటుచేసిన రెండు సలహా మండళ్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2017 ఆగస్టు, 17న రద్దుచేశారు. వర్జీనియాలో శ్వేతజాతీయులు జరిపిన దాడులకు ట్రంప్‌ మద్దతు తెలిపారన్న అసంతృప్తితో సభ్యులుగా ఉన్న పలువురు సీఈవోలు రాజీనామా చేయడంతో పాటు విమర్శులు గుప్పించారు. దీంతో ఆ రెండు సలహా మండళ్లను రద్దు చేస్తున్నట్టు అధ్యక్షుడు ప్రకటించారు. అధ్యక్షునిగా ఎన్నికయిన వెంటనే డిసెంబరులో ట్రంప్‌..16మంది సభ్యులతో వ్యూహాత్మక, విధానాల మండలి (స్ట్రేటజిక్‌ అండ్‌ పాలసీ ఫోరం) ఏర్పాటుచేశారు. అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత జనవరిలో వైట్‌హౌస్‌ మాన్యుఫాక్చరింగ్‌ జాబ్‌ ఇనిషియేటివ్‌ పేరుతో తయారీరంగం, ఉద్యోగకల్పనపై మరో సలహామండలిని ఏర్పాటు చేశారు.
views: 990

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams