Current Affairs Telugu Daily

జాతీయ పార్టీలకు రూ.957 కోట్ల  విరాళాలు
 నాలుగేళ్ల వ్యవధిలో జాతీయ రాజకీయ పార్టీలకు కార్పొరేట్‌ సంస్థలు రూ.956.77 కోట్ల విరాళాల్ని ఇచ్చినట్లు ప్రజాస్వామ్య సంస్కరణ సంఘం (ఏడీఆర్‌) నివేదిక తెలిపింది. 2012-13 నుంచి 2015-16 వరకు బహిర్గత విరాళాల్లో ఇది 89 శాతమని వెల్లడించింది. ఇందులో భాజపా అత్యధిక స్థాయిలో 2,987 కార్పొరేట్‌ సంస్థల నుంచి రూ.705.81 కోట్లను పొందినట్లు వివరించింది. కాంగ్రెస్‌ పార్టీ 167 సంస్థల నుంచి రూ.198.16 కోట్లు పొందినట్లు తెలిపింది. ఎన్సీపీ రూ.50.73 కోట్లు, సీపీఎం రూ.1.89 కోట్లు, సీపీఐ రూ.18 లక్షలు పొందాయని వెల్లడించింది. ప్రతి ఏటా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేడుకలు మించిన విరాళాలు అందించిన దాత వివరాల్ని రాజకీయ పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు అందజేసిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 
views: 938

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams