Current Affairs Telugu Daily

2015లో ఆస్తమా, సీఓపీడీతో 30 లక్షలకుపైగా మరణాలు
ఆస్తమా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ప్మనరీ డిసీస్‌ (సీఓపీడీ) కారణంగా 2015లో ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా ప్రాణాలు విడిచినట్లు లాన్సెట్‌ జర్నల్‌ నివేదిక పేర్కొంది. సీఓపీడీకి పొగ తాగడం, వాయు కాలుష్యం ప్రధాన కారణాని పేర్కొంది. 1990తో పోలిస్తే వ్యాధులు వ్యాప్తి, మరణా రేట్లు తగ్గినప్పటికీ.. జనాభా వృద్ధి కారణంగా మరణాల సంఖ్యలో పెరుగుద నమోదైందని తెలిపింది.
నివేదికలోని వివరాలు.. 
- భారత్‌తోపాటు పపువా న్యూ గినియా, లెసోతో, నేపాల్‌ల్లో సీఓపీడీ ప్రభావం తీవ్రంగా ఉంది. 
- ఆస్తమా తీవ్రత అఫ్గానిస్థాన్‌, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌, ఫిజీ, కిరిబాటి, లెసోతో తదితర దేశాల్లో ఎక్కువగా కనిపించింది. 
- 2015లో ప్రపంచవ్యాప్తంగా సీఓపీడీ వల్ల 32 లక్షల మంది, ఆస్తమా కారణంగా 4 లక్షల మంది మరణించారు. 
- భారత్‌లో ప్రతీ లక్ష మందిలో 2,775 మంది సీఓపీడీకి, 4,022 మంది ఆస్తమాకు గురయ్యారు. 
- 1990తో పోలిస్తే 2015లో సీఓపీడీ కేసు సంఖ్య 44.2 శాతం, మరణాల సంఖ్య 11.6 శాతం పెరిగింది. 
- ఆస్తమా కేసు సంఖ్య 12.6 శాతం పెరగ్గా.. మరణా సంఖ్య 26.2 శాతం తగ్గింది.

views: 983

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams