Current Affairs Telugu Daily


14 పాఠశాలకు జాతీయ స్వఛ్ఛ విద్యాలయ పురస్కారాలు 
 తెలంగాణ రాష్ట్రంలోని 14 సర్కారు బడుల జాతీయస్థాయి స్వఛ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఎంపికయ్యాయి. దేశవ్యాప్తంగా 172 పాఠశాలలు ఎంపికవగా అందులో రాష్ట్రానికి చెందినవి 14 ఉండటం(8శాతం)పై అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం నిర్వహణ, పరిసరా పరిశుభ్రం, తాగునీరు, విద్యార్థుల చేతులు శుభ్రం చేసుకునేందుకు ఉన్న సౌకర్యం తదితర వాటిని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. రాష్ట్రస్థాయిలో 40 పాఠశాలలు ఎంపికవగా వాటిని కేంద్ర మానవవనరుల శాఖకు ఇటీవలే సర్వశిక్ష అభియాన్‌ అధికారులు పంపారు. వాటిల్లో 14 బడులను  కేంద్రం జాతీయస్థాయి పురస్కారాలకు ఎంపిక చేసింది. సెప్టెంబరు 1న ఢిల్లీలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. దీని కింద ప్రశంసాపత్రంతోపాటు రూ.50 వేల నగదు బహుమతిని అందజేస్తారు.
views: 938

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams