Current Affairs Telugu Daily

కిలిమంజారోను అధిరోహించిన ఏపీ, తెలంగాణ విద్యార్థులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 9 మంది విద్యార్థులు ఆఫ్రికాలోకెల్లా అత్యంత ఎత్తయిన కిలిమంజారో (5,895 మీటర్లు)పర్వత శిఖరాన్ని ఆగస్టు 14న అధిరోహించారు. శిఖరాగ్రాన 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య దిన సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, గిరిజన వీరుడు కోమ్రం భీం  చిత్రపటాలను ప్రదర్శించారు. తెలంగాణ నుంచి సబావత్‌ సునీత(10వ తరగతి), నాయిని మల్లేశ్‌ (ఆసిఫాబాద్‌ గిరిజన ఆశ్రమ పాఠశాల) ఆనంద్‌ కుమార్‌, శ్రీకుమార్‌, అరుణ్‌ కుమార్‌ (న్లగొండ), చరణ్ రాజ్‌ (డిగ్రీ విద్యార్థి) రాఘవేంద్ర (మహబూబ్నగర్‌) ఈ బృందంలో ఉన్నారు. ఏపీ నుంచి సత్యారావు (డిగ్రీ విద్యార్థి, బంగారుపాలెం, విశాఖపట్నం), రఘునీధ్‌ (మౌంటెనీరింగ్‌ గైడ్‌, తాడేపల్లి, గుంటూరు) ఈ బృందంలో ఉన్నారు. తమిళనాడు నుంచి నలుగురు, పశ్చిమ బంగ,  మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరు కూడా బృందంలో ఉన్నారు.
views: 1226

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams