Current Affairs Telugu Daily

రోదసీకి చేరిన తొలి సూపర్‌ కంప్యూటర్‌
 స్పేస్‌ ఎక్స్‌ సంస్థకు చెందిన మానవరహిత రవాణా వ్యోమనౌక డ్రాగన్‌ మొట్టమొదటి సూపర్‌
కంప్యూటర్‌ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేర్చింది. 2900 కిలోల బరువైన ఈ నౌక 2017  ఆగస్టు 16న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్నట్లు నాసా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2017 ఆగస్టు 14న ఫ్లారిడాలోని కేప్‌కెనవారాల్‌ నుంచి ఈ వ్యోమనౌక ప్రయోగం విజయవంతంగా జరిగింది. ఇప్పటికే రోదసీలో ఉన్న వ్యోమగాములకు ఈ నౌక ఆహారం, ప్రత్యేక దుస్తులను కూడా మోసుకెళ్లింది. ఇది స్పేస్‌ ఎక్స్‌కు సంబంధించిన 12వ అంతరిక్ష ప్రయోగం. అంతరిక్ష కేంద్రానికి చేరిన సూపర్‌ కంప్యూటర్‌ను హ్యూలెట్‌ ప్యాకార్డ్‌ సంస్థ రూపొందించింది. దీన్నే స్పేస్‌ బర్నో కంప్యూటర్‌ అని కూడా అంటారు. ఈ సూపర్‌ కంప్యూటర్‌ అంతరిక్షంలో ప్రతికూ వాతావరణంలో కూడా పనిచేయగలదా లేదా అన్నది పరిశోధకులు ఇప్పుడు పరీక్షించనున్నారు.

views: 1140



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams