Current Affairs Telugu Daily

ప్రముఖ వైద్యురాలు ‘డాక్టర్‌ దీదీ’  భక్తి యాదవ్‌  మృతి
ఎంతోమంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందించి, ‘డాక్టర్‌ దీదీ’గా ప్రఖ్యాతిగాంచిన భక్తి యాదవ్‌(91) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమె 2017  ఆగస్టు 14 ఉదయం తుది శ్వాస విడిచారు. గత ఆరు దశాబ్దాలుగా దాదాపు లక్ష మంది పేద మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించారు. 1948-53 మధ్య కాలంలో ఇండోర్‌లోని మహాత్మాగాంధీ ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఎంబీబీఎస్‌ కోర్సు అభ్యసించిన ఏకైక మహిళ భక్తి యాదవ్‌. గైనకాజిస్టుగా సేవలందించిన ఆమెను ఇటీవల కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
views: 1034



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams