Current Affairs Telugu Daily

రాజకీయాల్లోకి ఉపేంద్ర
కర్ణాటకలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటన ? పారదర్శక ప్రత్యామ్నాయమే లక్ష్యమని వెల్లడి      ప్రముఖ కన్నడ సినీనటుడు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు, ‘రియల్‌ స్టార్‌’ ఉపేంద్ర తాను త్వరలో కర్ణాటకలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది మొదట్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిలకు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ప్రజాసమస్యను పరిష్కరించే శక్తిసామర్థ్యాలు, ఆలోచనలు ఉన్న వారికి వేదిక కల్పించేందుకు పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించారు.
    ప్రస్తుత రాజకీయాలకు పూర్తి పారదర్శక ప్రత్యామ్నాయాన్ని అందించాన్నది తన యోచన అని పేర్కొన్నారు. ఆయన 12న బెంగళూరులోని రుప్పీస్‌ రిసార్ట్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఖాకీ చొక్కా ధరించిన ఉపేంద్ర ‘ఈ దుస్తులు కష్టించి పనిచేసే ‘జన కార్మికుడి’కి ప్రతీక అని వ్యాఖ్యానించారు. ‘మా పార్టీ జన నాయకుడిని, జన సేవకుడిని కాకుండా ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే జన కార్మికుడికి ప్రతీక. నాతో నడవాలనుకునే వారు ఈ ఆలోచనతో ఉండాలి. ఖాదీకి బదులు ఖాకీ ధరించాలి. మాది బహిరంగ వేదిక. ప్రతి ఒక్కరూ కసిరావాలి’ అని పిలుపునిచ్చారు.  

views: 947

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams