Current Affairs Telugu Daily

‘హరితమిత్ర’ అవార్డుల ప్రకటన 
పచ్చదనం పెంచేందుకు కృషిచేసినవారికి తెలంగాణ ప్రభుత్వం హరితమిత్ర అవార్డులను ప్రకటించింది. ప్రజాప్రతినిధు, అధికారులు, ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు.. వివిధ విభాగాలకు చెందినవారు ఈ బితాలో ఉన్నారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున వీరికి హరితమిత్ర అవార్డులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిషా‘త్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’లో పచ్చదనం కోసం కృషిచేసిన వారిని గుర్తించి, అవార్డులకు ఎంపికచేసినట్లు అటవీశాఖ పేర్కొంది. రాష్ట్రస్థాయి హరితమిత్ర అవార్డులకు ఐదుగురు ఎంపికయ్యారు. ఇందులో అధికారుల విభాగంలో వై.శేఖర్‌రెడ్డి (వరంగల్‌ రూరల్‌ జిల్లా), ప్రజాప్రతినిధుల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి (వరంగల్‌ రూరల్‌,నల్లబెల్లి మండలం), అటవీశాఖ అధికారుల విభాగంలో సి.శ్రీధర్‌రావు (సిద్దిపేట జిల్లా డీఎఫ్‌ఓ), ప్రభుత్వ విభాగంలో ఎంపీపీఎస్‌ ముర్రపల్లి (జగిత్యా జిల్లా), విద్యాసంస్థలు, సంస్థ విభాగంలో అటవీశాఖ ఎస్‌సీసీఎల్‌ రామగుండం ఏరియా (పెద్దపల్లి జిల్లా) ఉన్నాయి. జిల్లా స్థాయిలో వ్యక్తులకు, సంస్థలు, స్థానికసంస్థలకు కలిపి 50 అవార్డులను ప్రకటించారు.
views: 1262

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams