Current Affairs Telugu Daily

క్యోటో ప్రోటోకాల్‌ లక్ష్యాలపై యూఎన్‌ఓకు భారత్‌ హామీపత్రం
కర్బన ఉద్గారాల తగ్గింపుపై క్యోటో ప్రోటోకాల్‌కు అనుగుణంగా 2020 వరకు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కట్టుబడుతూ ఐక్యరాజ్యసమితికి భారత్‌ 2017 ఆగస్టు 8న హామీ పత్రాన్ని ఇచ్చింది. 1997 డిసెంబరులో కుదిరిన క్యోటో ప్రోటోకాల్‌ 2005 ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల సాధనకు ఆయా దేశాలు కట్టుబడాల్సిన తొలి కాలావధి 2008-2012. ఖతార్‌లోని దోహాలో 2012లో జరిగిన వాతావరణ సదస్సులో ఈ ఒప్పందానికి సవరణ తీసుకొచ్చారు. దీనిని దోహా సవరణగా పేర్కొంటారు. 2013 జనవరి నుంచి 2020 డిసెంబరు వరకు సాధించాల్సిన లక్ష్యాలు, ఇతర అంశాలు ఈ సవరణలో భాగంగా ఉన్నాయి.
views: 1139



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams