Current Affairs Telugu Daily

ఉగ్రవాది సయీద్‌ నూతన రాజకీయ పార్టీ మిల్లి ముస్లిం లీగ్‌(ఎంఎంఎల్‌)
గృహనిర్బంధంలో ఉన్న ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ తాను నెలకొల్పిన మత సంస్థ జమాత్‌ ఉల్‌ దవాకు కొనసాగింపుగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించాడు. సయీద్‌ ప్రధాన అనుచరుడు సైఫుల్లా ఖలీద్‌ 2017 ఆగస్టు 7న పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో కొత్త పార్టీ  మిల్లి ముస్లిం లీగ్‌(ఎంఎంఎల్‌)ను ప్రకటించాడు. పాకిస్తాన్‌ను నిజమైన ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చడమే తమ ధ్యేయమని సైఫుల్లా పేర్కొన్నాడు. గ హనిర్బంధంలో ఉన్న హఫీజ్‌ సయీద్‌ విడుదలయ్యే వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తానే నిర్వహిస్తానని సైఫుల్లా ఖలీద్‌ తెలిపాడు. పలు ఉగ్రకుట్రకు కేంద్రబిందువైన హఫీజ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ భారత్‌ సహా పలు దేశాలు పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడంతో అక్కడి ప్రభుత్వం అతన్ని 2017 జనవరి 31న నిర్బంధించింది. గడిచిన ఆరు నెలలుగా హఫీజ్‌ గృహ నిర్బంధంలోనే ఉన్నాడు. 2017 జులై 27న అతని హౌస్‌ అరెస్ట్‌ను మరో 2 నెలలు పొడిగించారు. 
views: 950

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams