Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌ కేబినెట్‌లో హిందువులకు చోటు
పాకిస్థాన్‌ నూతన ప్రధానమంత్రి షాహిద్‌ ఖాకన్‌ అబ్బాసీ 2017 ఆగస్టు 4న కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రధాని పదవి నుంచి దిగిపోయిన నవాజ్‌ షరీఫ్‌ అనుచయి, మిత్రపక్షాలకు తన కేబినెట్‌లో పెద్దపీట చేశారు. అదేవిధంగా తొలిసారి ఓ హిందువుకు మంత్రి మండలిలో అవకాశం కల్పించారు. గడిచిన 20 సం॥లో ఒక హిందువు పాకిస్థాన్‌ కేబినెట్‌లో చోటు సంపాదించడం ఇదే ప్రథమం. హిందువు అయిన దర్శన్‌లాల్‌ కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. పాకిస్థాన్‌లోని 4 ప్రావిన్సును సమన్వయం చేయడం దర్శన్‌లాల్‌ బాధ్యత. 65 ఏళ్ల దర్శన్‌లాల్‌ సింధ్‌ ప్రావిన్స్‌ ఘోట్కి జిల్లాలోని మీర్‌పూర్‌ మథెలో పట్టణానికి చెందిన వారు. వృత్తిరీత్య డాక్టర్‌ అయిన ఆయన 2013లో పాక్‌ పార్లమెంటుకు పీఎంఎల్‌-ఎన్‌ టికెట్‌పై వరుసగా రెండోసారి గొలుపొందారు. మైనారిటీలకు రిజర్వు చేసిన సీటు నుంచి ఆయన పాక్‌ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో అడుగుపెట్టారు. 
పాకిస్థాన్‌ అధ్యక్షుడు - మమ్నూన్‌ హుస్సేన్‌ 

views: 1035

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams