Current Affairs Telugu Daily

ఉత్తర కొరియాపై కఠిన ఆంక్షలకు యూఎన్‌ఓ భద్రతా మండలి ఆమోదం
ఉత్తర కొరియాపై కఠిన ఆంక్షలను విధిస్తూ అమెరికా రూపొందించిన తీర్మానానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీని వల్ల ఉత్తర కొరియాకు ఏటా 100 కోట్ల డాలర్ల మేర ఆదాయాన్ని ఇచ్చే ఎగుమతులపై నిషేధం అమలవుతుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా చేపట్టిన మొదటి చర్య ఇదే. దీనికి ఉత్తర కొరియా మిత్రపక్షమైన చైనా కూడా మద్దతు పలికింది. ఇప్పటికే తీవ్రంగా నిధుల కొరతను ఎదుర్కొంటున్న ఉత్తర కొరియాకు తాజా ఆంక్షలు శరాఘాతం కానున్నాయి.వీటివల్ల ఆ దేశం.. బొగ్గు, ఇనుము, ఇనుప ఖనిజం, సీసం, ముడి సీసం, చేపలు, ఇతర సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతులు చేయడానికి వీల్లేదు. ఫలితంగా ఆ దేశ ఎగుమతి ఆదాయంలో మూడో వంతు మేర కోత పడుతుంది.ఉత్తర కొరియా ఎగుమతులు ఏటా 300 కోట్ల డాలర్ల మేర ఉన్నాయి. ఆ దేశానికి ప్రధాన ఆర్థిక భాగస్వాములుగా ఉన్న చైనా, రష్యాలు ఈ ఆంక్షను పూర్తిగా అమలు చేస్తే.. ఉత్తర కొరియా చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటుంది.విదేశాలకు పంపే కార్మికుల సంఖ్యను పెంచుకోకుండా కూడా ఈ తీర్మానం ఆ దేశాన్ని నిరోధిస్తుంది.
views: 945

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams