Current Affairs Telugu Daily

మొగల్‌సరాయ్‌ స్టేషన్‌కు దీన్‌దయాల్‌ పేరు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని చారిత్రక మొగల్‌సరాయ్‌ రైల్వేస్టేషన్‌కు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ సిద్ధాంతకర్త దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్‌ పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్రం 2017 ఆగస్టు 4న ఆమోదం తెలిపింది. దేశంలో రైళ్ల రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే కూడళ్లలో మొగల్‌సరాయ్‌ది 4వ స్థానం. వారణాసికి 20 కి.మీ.ల దూరంలో హావ్‌డా-ఢిల్లీ మార్గంలో ఈ స్టేషన్‌ ఉంది. భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌శాస్త్రి జన్మస్థలం కూడా మొగల్‌సరాయ్‌నే. 1968లో మొగల్‌సరాయ్‌ స్టేషన్‌లో దీన్‌ దయాల్‌ అనుమానస్పద పరిస్థితిలో మృతిచెందారు. దీంతో స్టేషన్‌కు ఆయన పేరే పెట్టాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. 
views: 1043

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams