Current Affairs Telugu Daily

భారత్‌లో అంతర్థానమయ్యే ముప్పు ఉన్న భాషలు 10
భవిష్యత్తుల్లో అంతర్థానమయ్యే భాష అధ్యయనానికి సంబంధించి తీసుకురాదలచిన 50 సంపుటాల్లో 11 సంపుటాలను 2017 ఆగస్టు 3న న్యూఢిల్లీలో పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(PLSI) ఛైర్మన్‌ గణేష్‌ ఎన్‌.దేవి విడుదల చేశారు. దేశంలో మాట్లాడే భాషల్లో రానున్న 50 ఏళ్లలో సగానికి పైగా భాషలు అంతర్థానమయ్యే ఆస్కారముదని, 780 భాషలకుగాను కనీసం 400 భాషలు ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 6000 భాషలు మాట్లాడుతుండగా, దాదాపు 4000 భాషలకు ఈ పరిస్థితి ఎదురయ్యే ఆస్కారముంది. ముప్పున్న భాషల్లో 10 భారత్‌లోనే ఉన్నాయన్నారు. భారత్‌లో తీర ప్రాంత భాషకు ముప్పు అత్యంత ఎక్కువగా ఉందన్నారు. కనుమరుగయ్యే ఆస్కారమున్న భాషల్లో అత్యధికం ఇవేనన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష భోజ్‌పురి అయ్యుండొచ్చని గణేష్‌ తెలిపారు. గత 5 దశాబ్దాల్లో భారత్‌ 250 భాషను కోల్పోయిందని గణేష్‌ తెలిపారు. ఏదైనా భాష పుట్టుక వెనుక వేల సంవత్సరాల కృషి ఉంటుందని, భాషను కోల్పోవడమంటే పూర్వీకులకు తీవ్ర అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు. ‘‘ఒక భాష అంతర్థానమైందంటే దానితో ముడిపడిన సంస్కృతి కూడా కనుమరుగైనట్లే’’ అన్నారు. PLSI ఇప్పటివరకు దేశంలోని 780 భాషలపై 27 రాష్ట్రాల్లో మూడు వేల మందితో అధ్యయనం జరిపింది.
PLSI-People's Linguistic Survey of India

views: 938

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams