Current Affairs Telugu Daily

భూకంపాల జోన్‌లో 29 నగరాలు
దేశంలో 29 నగరాలు భూకంపాల జోన్‌లో ఉన్నాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ (ఎన్సీఎస్‌) నివేదిక వెల్లడించింది.
    వాటిలో దేశ రాజధాని ఢల్లీతో పాటు తొమ్మిది రాష్ట్రాలు 
    రాజధానులున్నాయి. ఇవి ఎక్కువగా హిమాలయాల పరిధిలో
    ఉన్నాయి. దీనికి ప్రపంచంలోనే ఎక్కువ భూకంపాలు  సంభవించే ప్రాంతంగా గుర్తింపు ఉంది.
    ఢల్లీ, పట్నా, శ్రీనగర్‌ కొహిమా, పుదుచ్చేరి, గువాహటి, గ్యాంగ్‌టక్‌,సిమ్లా, డెప్రోడూన్‌, ఇంఫాల్‌, చండీగడ్‌ భూకంపం సంభవించే ప్రాంతాలలో మొదటి, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ది బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ దేశంలో భూకంపం సంభవించే ప్రాంతాలను ఐదు జోన్లుగా వర్గీకరించింది. ఐదో జోన్‌ అత్యంత తీవ్రత కలిగిన ప్రాంతం, ఈ జోన్‌లో ఈశాన్య ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌లోని కచ్‌, ఉత్తర బిహార్‌లోని కొన్ని ప్రాంతాలు,  అండమాన్‌ నికోబార్‌ దీవులున్నాయి.

views: 1043

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams