Current Affairs Telugu Daily

భారత్‌ కు ‘మిగ్‌-35’ యుద్ధ విమానాలు
భారత్‌కు మిగ్‌-35 యుద్ధ విమానాలు అమ్మేందుకు ఆసక్తిగా ఉన్నామని రష్యా ప్రకటించింది.
    ఈ అంశంపై భారత్‌తో చర్చలు కొనసాగిస్తున్నామని, భారత్‌
    కూడా ఆసక్తిగా ఉందని మిగ్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఇల్యా
    టారసెంకో తెలిపారు. రష్యా రూపొందించిన అత్యాధునిక 4GG జనరేషన్‌ యుద్ధ విమానాలే మిగ్‌ 35. దాదాపు 50
    ఏళ్లుగా భారత్‌ రష్యాకు చెందిన మిగ్‌ విమానాల్ని వినియోగిస్తోంది.
మిగ్‌-35 ప్రత్యేకతలు
- ఒకరు లేదా ఇద్దరు పైట్లలు నడపొచ్చు. టేకాఫ్‌ సమయంలో గరిష్ట బరువు 29,700 కిలోలు
- ఎత్తులో ఉన్నప్పడు గరిష్ట వేగం గంటకు 2,400 కి.మీ.లు సముద్రమట్టంలో వేగం 1450 కి.మీ.లు
- 1000 కి.మీ.లు పరిధిలో యుద్ధ విన్యాసాలు చేయగలదు.
- గన్స్‌ : జీఎస్‌హెచ్‌-301 ఆటోకేనన్‌ (150 రౌండ్స)
- రాకెట్‌లు : ఐదు
- క్షిపణులు: గగనతలం నుంచి గగనతలం(రెండు) గగనతలం నుంచి భూఉపరితలంపైకి(ఒకటి) యాంటీ రేడియేషన్‌ మిస్సైల్‌, యాంటీ షిఫ్‌ మిస్సైల్‌
బాంబులు: కేఎబీ- 500కేఆర్‌, కేఏబీ-500ఎల్‌, కేఏబీ-500ఎస్‌

views: 995

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams